శ్రీ రామ హరే రామ !
శ్రీ కాంతో మాతురో యస్య జనని
సర్వ మంగళా జనకః శంకరో దేవః
తం వందే కున్జరాననం
జయతి మరకతా భవ్య త్పరం వస్తు సత్యం
నిఖిల నిగమ మ్రుడ్యం రామ నామ్న ప్రతీతం
భవ జలధి నిమగ్న ప్రాణి నౌకాయ మానం
భవతు మమ గతిహి తత్ బాలక్రిష్ణాపి వేద్యం
రామాయ రామ భద్రాయ రామ చంద్రాయ వేదసే
రఘునాథాయ నాధాయా సీతాయః పతయే నమః
బుద్ధిర్బలం యశో ధైర్యం
నిర్భయత్వం అ రోగతాం
అజాడ్యం వాక్ పటుత్వం చ
హనూమత్ స్మరణాత్ భవేత్
శ్రీ రామ శరణం మమ శ్రీ కృష్ణ శరణం మమ
స్వస్త్యస్తూ సమస్త సం మంగళాని సంతు
సమస్త ఐశ్వర్య ప్రాప్తి రస్తు
శ్రీమద్ రామాయణే బాల కాండే సీతా రామ వివాహ ఘట్టే
శ్రీ త్యాగరాజ ముఖేన అధ్య వర్తమాన కథా ప్రసంగః
+++++++
రాగ రత్న మాలిక చే రంజిల్లున ట హరి సదా
బాగ సేవించి సకల భాగ్యముల మందు దము రారే !
ఈ నవ రాత్రి లో -
నవ రాత్రి అంటే మీ కందరికీ తెలుసు -
తొమ్మిది రాత్రులు -
నవ రాత్రి అంటే తొమ్మిది రాత్రులని తెలవడం కన్నా మనం ఇంట్లో బొమ్మల కొలువు పెడతామన్నది అందరికీ తెలుసు
ఇది ఎవరికైనా తెలియక పోతుందేమో నని ఇక్కడ బొమ్మలే కొలువే పెట్టి ఉన్నారు -
ఈ కొలువు పెట్టడడం స్త్రీ లకి , అమ్మాయిలకి పిల్లలకి చాల ఇష్టమైన విషయం
కొలువు పెట్టడం ఎక్కడైనా పురాణం లో చెప్ప బడి ఉందా, లేక శాస్త్రం లో చెప్ప బడి ఉందా ?
కొలువు పెట్టక పొతే ఏమి ?
గమనించాల్సిన విషయం ఏమిటంటే శాస్త్రం లో ఏది చెప్ప బడలేదో, అదంతా తూచా తప్పకుండా చేస్తున్నాం
ఏదైతే శాస్త్రం లో చెప్పారో అదంతా వదిలేసాం
శాస్త్రం లో ఏదైతే చెప్ప బడలేదో దీపావళి - దాన్ని బ్రహ్మాండం గా పటాటోపం తో కొనియాడుతాం
అట్లాగే ఈ కొలువు పెట్టడం కూడా ఒక ఆనవాయితీ అయిపొయింది.
కొలువు పెట్టడానికి ఒక తాత్పర్యం ఉంది. ఆ భావనతో పెడతారేమో తెలియదు.
అంబ కొలువై ఉంది. అంబ ఎలా ఉందంటే - తాను నిశ్చలం గా ఉంది , లోకాన్ని నడుపుతోంది. తాను నిశ్చలం గా ఉండడం తో , లోకం లో ఎన్ని మార్పులు జరుగుతూన్న తన దగ్గిరికి అవి రావు. అట్లా అన్నింటికీ ఆవల ఉన్న అంబ - సర్వ చైతన్య రూపాన్తాం ఆద్యాం విద్యాం చ ధీమహీ బుద్ధిం ధ్యాన ప్రచోదయాత్ - ఇది అంబ స్వరూపం.
అట్లా చైతన్య రూపిణి ఐన అంబ సర్వ జీవ రాసులలోనూ ఉంటోంది కదా ? సృష్టి లో వివిధ రూపాలలో ఈ అంబ ఉండడం తో వాటి కి ప్రతీకగా ఇలా మనం బొమ్మల కొలువు పెడుతున్నాం కొలువు పెట్టడం లో కూడా ఒక పద్దతి ఉంది. ఎవరెవర్ని , ఎవరెవరితో , ఎ మెట్లమీద పెట్టాలో దానికని ఒక పధ్ధతి ఉంది.
కొలువులో ఒక శ్రేష్టి బొమ్మ పెడితే ఆతనికి సంబంధించిన వాటిని ఆ బొమ్మ ప్రక్క పెడితే అది లక్షణం గా ఉంటుంది. అలా కాకుండా శ్రేష్టి గారి పక్కన పులి బొమ్మని పెడితే బాగుంటుందా ? కాబట్టి ఎవరి తో ఎవరు కలసి ఉండాలో అన్న తాత్పర్యాన్ని ఇది తెలుపుతుంది. వీటిన్నటికి ఎట్లాంటి ఆధారాలు లేవు.
అంబ కొలువై ఉంది. ఎక్కడ ? మన మనసులో. మన జీవం లో. ప్రతి రోజు అభివృద్ధి చెందుతోంది.
శారదా నవరాత్రి , వసంత రాత్రి అని రెండు నవరాత్రులు.
వసంత రుతువు , శరద్ ఋతువు, రెండు ఋతువులు.
మనకి ఋతువుల పేర్లే తెలియకుండా పోతుందేమో ?
అసలు ఈ ఊళ్ళో పంచాంగం ఉందా అంటే సందేహమే . చాలా మంది ఇంట్లో ఉండక పోవచ్చనుకుంటా ఎవరైనా ఒకరిద్దరి ఇంట్లో ఉంటె గింటే వారు దాన్ని చూస్తారా అన్నదీ సందేహమే !
వసంత రుతువు - చైత్ర వైశాఖం
మన పిల్లలకి పెద్దలైన మీరే నేర్పాలి
ఇంతకు మునుపే ఇక్కడ ఒకరి తో నేను చెప్పాను. - మన కల్చర్, హెరిటేజ్ ఇవన్ని ధ్యాసతో కాపాడుకోవాలని తపన , మన అమెరిక నించి వచ్చిన భారతీయుల వద్ద ఎక్కువగా చూడొచ్చు. ఇది నేను చూసిన విషయం. వాళ్ళ దగ్గిర శ్రద్ధ ఉంది. సంస్కృతం నేర్చుకుంటున్నారు. చికాగో వెళ్ళినప్పుడు , ఒక చిన్న పిల్లవాడు రుద్రం, చమకం చెప్పడం విని సంతోషం చెందిన వాణ్ని.
మన ఇంట్లో పిల్లలైతే రుద్రమా , చమకమా అదేంటి అంటున్నారు. ఒకసారి చంద్ర శేఖర స్వామీ వారి వద్ద వెళ్లి , ఆచార్యుల వారి వద్ద వెళ్లి - ' మన ఈ తరం అసలు సంధ్యావందనం చెయ్యటం లేదు. మీరు ఒక ఆర్డర్ ఇవ్వాలి - అందరూ సంధ్యావందనం చెయ్యాలని ' అన్నాను. దానికాయన అడిగారు - ఏమిటండి - మీ అబ్బాయి ధోతి అయినా కడుతాడా? " అసలు ధోతి అయినా కడుతున్నాడా? అదీ ప్రశ్న !
మన సంప్రదాయానికి ఈడైనది ఏది ఉంది? మన సంప్రదాయం మనిషి గొప్పతనాన్ని పెంపొందింప చేస్తుంది. మిగిలిన వన్నీ , అసురత్వాన్ని పెంపొందించేవి.
ఒక నెలగా నేనిక్కడ ఉంటున్నాను. మధ్యాహ్న వేళలో టీవీ చూస్తున్నాను. మధ్యాహ్న సమయం లో నాకేం పనీ పాటా లేదు. - "What are you doing? " అని ఎవరైనా అడిగితె - తటాల్మని నా సమాధానం - " I watch TV" !
ఏముంది టీవీ లో? చెప్పిందే చెబ్తున్నాడు. పెట్టిన ప్రోగ్రాం మళ్ళీ మళ్ళీ అదే పెడ్తున్నాడు. మధ్యలో నాకు advertisement కి కథకి వ్యత్యాసం తెలియకుండా పోతోంది. పోనీ advertisement ఏదైనా వెరైటీ గా ఉందా అంటే అదీ లేదు. ఈయన టీవీ లో పని చేస్తున్నారు. తప్పుగా ఏమైనా అనుకో బోతారు. టీవీ లో తిప్పి తిప్పి తినే సామన్లనే చూపిస్తున్నాడు.
అందువల్ల నేననుకున్దేమంటే - ఈ అమెరికా వాళ్ళు , మంచి ' భోక్తలు ' - మంచి తిండి తినే వారు కామోసు అని ! . ఇవన్ని అసుర ప్రాయం , రాక్షస ప్రాయం - ఇవన్నీ చెప్పాల్సిన పనే లేదు. వీటిని నేర్పటానికి ఎ లాంటి బళ్ళూ అవసరం లేదు. ఒక తప్పు కార్యాన్ని చెయ్యడాని కి ఎవరు నేర్పించనక్కర్లేదు.
సులభః పురుషః రాజన్ సతతం ప్రియవాదినః
అప్రియస్య తు పత్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః
మంచి విషయాన్ని చెప్పేవారు లేరు, చెప్పినా వినే వాళ్ళు లేరు - మంచి విషయాన్ని ఎవరైనా చెప్పినా ఎవరు వినరు. వారు వినరు కాబట్టి వీళ్ళూ , మనకేంటి అని చెప్పడం మానుకుంటారు.
'How is your son sir? "
వాడి కేమండి - "I give him full freedom "
full freedom ! అలా చెప్పే మనం మాట దాటేయ్యాలి వేరే మార్గం లేదు.
సులభః పురుషః రాజన్ సతతం ప్రియవాదినః
అప్రియస్య తు పత్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః
మనం ఆహ్లాదం గా నవ్వుకోటానికి, మనకి ఇంపైన మాటలనే చెప్పడానికి చాల మంది ఉంటారు. ఇది చెయ్యొద్దని చెప్పే వాళ్ళు లేరే లేరంటారు.
కాబట్టి మనకి ధర్మం అంటే ఏమిటని చెప్పే వాళ్లైనా ఉండాలి.
ఓయ్ - ఇది అటామిక్ ఏజ్ , నూక్లియర్ ఏజ్ - ఈ ఏజ్ లో ఇట్లాంటి చాందస భావలేమిటి? మడేమిటి ? ఆచారం ఏమిటి? పుణ్యం ఏమిటి? పాపం ఏమిటి? అని ఒకాయన నన్నడిగారు. ఇప్పుడు తెలవదండీ మీకు వీటి గురించి. ఎవడైనా రిసెర్చ్ చేసి వాటి గురించి చెబ్తాడు. అప్పడు మీరు నమ్మక తప్పదు. సైంటిఫిక్ రిసెర్చ్ చేసి ప్రతి దానికి వాళ్ళు కారణం చెబ్తున్నారు. రాబోయే కాలం లో అట్లా ఎవరైనా రిసెర్చ్ చేసి కారణాలు చెబితే, మన ఇండియా దేశంలో ఇవన్ని ఉండే వంటా అని తెలియకుండా పోతుందేమో ?
ఇప్పుడు నేనివన్నీ చెప్పినంత మాత్రాన ఎవరైనా వెంటనే చేస్తారంటార? అయినా మన లని మనం కొంతలో కొంత మంచి వైపు మళ్ళించు కోవచ్చు గదా? మనలో నే ఒక నిర్ణయం, ఒక నిబద్ధత , ఒక discipline' తెచ్చుకోవచ్చు గదా ? ఇట్లా మనల్ని మనమే ఒక మంచి దారి లో మళ్ళించు కోవచ్చు కదా. ?
త్యాగరాజ స్వామీ వారి గొప్పదనం అదే . ఎంత గొప్పవాడై ఉండ వచ్చు ఆయన? ఎంత పెద్ద చక్రవర్తి ఐ ఉండ వచ్చు ఆయన? ఎందఱో ఆయన కాళ్ళ మీద పడ్డారు. ఆయన దేనికి తల వొంగలేదు. ఆఖరి దాక నిరుపేద గా నే ఉండి తనువు చాలించాడు. ఆయనకి ఎట్లాంటి ప్రాపర్టీ లూ లేవు. మాన్యాలు కొనుక్కొని ఉండ కూడదా?
ఎంతో మంది గుళ్ళకి ట్రస్టీ లు గా ఉంటూ మడులు మాన్యాలు వెనకేసుకున్నారు. పెద్ద పెద్ద గుళ్ళకి ట్రస్టీ లవడానికి ఎలెక్షన్ లో పోటీ పడి గెలిచి పదవి లో ఐదేళ్ళు ఉండి అలా రాగానే - ఆయనకేమండి భూములు , ఇండ్లూ కొనుక్కొని ఉన్నాడు. డబ్బెక్కడి దండి ? గుటకాయ స్వాహా ! మీ దేశం లో ఉండదనుకుంటా. నేను చెబ్తున్నది ఇండియా గురించి. ఈ దేశం గురించి, అమెరికా గురించి చెప్పడానికి నా కేమి అర్హత ఉందీ ? ఇండియా గురించే చెబ్తున్నా.
ఇట్లా తప్పిన మార్గం లో ధన సంపాదన చేసుకుంటూ భేషుగా ఉంటున్న వాళ్ళు ఎంత మంది లేరు? ఇట్లా త్యాగరాజ స్వామి చేసి ఉండ వచ్చుకదా? ఆయనికి అట్లాంటి అవకాశాలెన్నో వచ్చేయి. ఆయన చేసారా? చెయ్యడాయన. కారణం ఏమిటి? వీటన్ని టికి పై పడ్డ ధర్మం ఆయన వద్ద ఉంది.
ఎ పనికో రామా
జన్మించితి నని ఎంచవలయు శ్రీ రామ
రాముడినే అడుగుతున్నాడు. - ఎ పనికో రామ నను జన్మించితివి? ఎ కారణం కోసం నేను జన్మించాను? నే నెందుకు కు జన్మించాను. ?
మనలో ఎవరైనా అడుగుతామా? అట్లా ప్రశ్నించిన వారొక్కరే -రమణ మహర్షి - "who am I" అని ప్రశ్నించు కున్నా డాయన. వేరే వాళ్ళని అడగ లేదు ఆయన. తనలో తనే ప్రశ్నించు కున్నాడు. దానికి ఆయనకి సమాధానం దొరికింది.
ఎ పనికో రామా
జన్మించితి నని ఎంచవలయు శ్రీ రామ
----Shree TS Balakrishna Sastri గారి తమిళ హరికథ కాలక్షేపానికి తెలుగు అనువాదం - by
జిలేబి.